

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై చర్చ మరోసారి ఊపందుకుంది. అమరావతిని అధికారికంగా రాజధానిగా ప్రకటించే గెజిట్ డిసెంబర్లో విడుదల అయ్యే అవకాశం ఉందనే సమాచారం వెలువడుతోంది. దీనికోసం CRDA చట్టపరమైన, పరిపాలన సంబంధిత ప్రక్రియలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల CRDA కమిషనర్ అమరావతి రైతులను కలిసి, గెజిట్కు సంబంధిత బిల్లు డిసెంబర్లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశముందని తెలియజేశారని సమాచారం. బిల్లు ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేకుండా ముందుకు సాగేందుకు న్యాయశాఖ కూడా కీలక అంశాలను పరిశీలిస్తోందని తెలుస్తోంది.
అంతర్గత సమీక్షల్లో ఒక ముఖ్యమైన విషయం కూడా స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది ప్రస్తుతం రాష్ట్రంలో ఏ నగరాన్నైనా అధికారికంగా రాజధానిగా ప్రకటించే గెజిట్ ఎక్కడా ప్రచురితం కాలేదు. ఈ వివరమే ఇప్పటి ప్రక్రియకు ప్రాముఖ్యతను ఇచ్చింది.
ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుండటం, డిసెంబర్ సమావేశాలు సమీపిస్తున్నాయన్న నేపథ్యంతో అమరావతి రైతుల్లో భారీగా ఆశలు పెరుగుతున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న రాజధాని సమస్య చివరకు స్పష్టమైన చట్టపరమైన రూపం దాల్చబోతోందన్న భావన వ్యక్తమవుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!