

భారత ప్రధాని నరేంద్ర మోదీపై నార్వేకు చెందిన ‘ఆఫ్టెన్పోస్టెన్’ పత్రిక ప్రచురించిన కార్టూన్ పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ కార్టూన్ జాత్యహంకారంతో కూడుకున్నదని, అవమానకరంగా ఉందని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. “తెలివైన కానీ విసిగించే వ్యక్తి” అనే అర్థం వచ్చేలా శీర్షికతో పాటు భారత విదేశాంగ విధానంపై కూడా విమర్శలు చేస్తూ వ్యాసం ప్రచురించిందని సమాచారం. ఈ విషయం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.
ప్రధాని మోదీ ఓస్లో పర్యటన సమయంలో ఈ కార్టూన్ బయటకు రావడం వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. నెటిజన్లు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది జర్నలిజం కాదని, వలసవాద కాలం నాటి జాత్యహంకారాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించారు. యూరోపియన్ మీడియా ఇప్పటికీ పాత భావజాలం నుంచి బయటపడలేదని కొందరు వ్యాఖ్యానించారు. ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో మీడియా నైతికతపై చర్చకు దారి తీసింది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!