

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన స్టాలిన్ ప్రభుత్వం ఈసారి ప్రజాభిమానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకేకు ప్రజలు భారీ మద్దతు ఇవ్వడంతో అధికార మార్పు చోటుచేసుకుంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు హిందూ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి. ఇదే సమయంలో కొలత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్ ఓటమి చెందడంతో ఆయన అసెంబ్లీలో ఉండడం లేదు. దీంతో డీఎంకే శాసనసభ పక్షాన్ని ముందుండి నడిపించే బాధ్యత ఇప్పుడు ఉదయనిధిపై పడింది. రాజకీయాలతో పాటు సినిమా రంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ సవాల్‌ను ఎలా ఎదుర్కొంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!