

ఏజెన్సీ ప్రాంతాల్లో పంటలకు ఏనుగుల బెడదకు చెక్ వేసేందుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తీసుకున్న వినూత్న చర్య ఫలితమిస్తోంది. అడవి ప్రాంతాల్లోకి ఏనుగులు రావడంతో పంటల నష్టం తీవ్రంగా పెరుగుతుండటంతో పవన్ చొరవతో కర్ణాటక నుంచి నాలుగు కుంకీ ఏనుగులను తీసుకొచ్చారు. వాటితో పాటు ఏఐ టెక్నాలజీ ఆధారిత సిస్టమ్ ను ప్రవేశపెట్టారు. సోలార్ ప్యానెల్ ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ ఏనుగుల కదలికను గుర్తించి తుపాకీ పేలుడు శబ్దాలు ఉత్పత్తి చేస్తుంది. ఆ శబ్దం విన్న ఏనుగులు భయంతో అడవుల్లోకే తిరిగి వెళ్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ టెక్నాలజీతో గ్రామాల్లోకి ఏనుగులు రావడం తగ్గిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఫలితాలు చూస్తున్న అటవీశాఖ అధికారులు ఇప్పుడు ఈ పద్ధతిని మిగతా జిల్లాల్లో కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. ఇంత కొత్త ఆలోచనతో ఏనుగుల సమస్యకు టెక్నాలజీ సొల్యూషన్ కనుగొన్న పవన్ కల్యాణ్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలు కూడా ఈ పద్ధతిని అనుసరించేందుకు సిద్ధమవుతున్నాయని సమాచారం.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (1)
Tech with purpose!