
సినిమాలు

మంగళగిరి ఎయిమ్స్‌లో కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి చికిత్స కోసం రావడంతో వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితుడికి అవసరమైన చికిత్స అందించిన అనంతరం హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ఇటీవల జ్వరాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది.
కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఎయిమ్స్‌లో ప్రత్యేక ఫీవర్ వార్డును ఏర్పాటు చేశారు. మరోవైపు గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్)లో కూడా వైద్యులు అప్రమత్తమై జ్వరం, శ్వాస సంబంధిత లక్షణాలతో వచ్చే రోగులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!