

తెలుగు మాట్లాడే వారిని చులకనగా చూసిన కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన సూచనకు తాను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు.
ఆదివారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో జనసేన నేత, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ పెనుగొండ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పలువురు ఆర్యవైశ్యులు జనసేన పార్టీలో చేరిన సందర్భంగా నాగబాబు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాభివృద్ధి, పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. గతంలో ప్రాజెక్టులకు రాజకీయ నాయకుల పేర్లు పెట్టే సంప్రదాయాన్ని విరమించి, గోదావరి జిల్లాలకు శుద్ధి చేసిన తాగునీరు అందించే ప్రాజెక్టుకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పేరు పెట్టడం ద్వారా ఆయన త్యాగాలను భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకునేలా చేశారని అన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!