

చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ ముంబయిలో అక్టోబరు 2న తల పెట్టిన ఆందోళనకు ముంబయి పోలీసులు అనుమతి నిరాకరించారని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆదివారం పేర్కొంది. ఈ ఆందోళనకు తమను అనుమతించని పక్షంలో అదే రోజు ముంబయిలో జైల్‌భరో ఆందోళన చేపడతామని సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. సీఈసీ రాజీనామా కోరుతూ తాము ఇచ్చిన 24 గంటల అల్టిమేటమ్ శనివారంతో ముగియడంతో అక్టోబరు 2 నుంచి దేశ వ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్లు సీజేపీ ప్రకటించింది.
ముంబయిలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం దేశంలో అన్ని నగరాల్లో చేపట్టనున్నట్లు ‘ఎక్స్’లో పేర్కొంది. సీజేపీ చేపట్టనున్న ఈ ఆందోళనకు తాను మద్దతు ఇస్తున్నట్లు పర్యావరణవేత్త సోనమ్ వాంచుక్ ఆదివారం ప్రకటించారు. అయితే ఆందోళనలో తాను ప్రత్యక్షంగా పాల్గొనకపోవచ్చని తెలిపారు. ఇదిలా ఉండగా, గువాహతిలో సీజేపీ తొలిసారిగా నిర్వహించే సమావేశానికి వెళుతోన్న సీజేపీ కోకన్వీనర్ అశుతోష్ రంకా తదితర వలంటీర్లను అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీజేపీ ఆదివారం తెలిపింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!