30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం.. టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు

Writer: Vamshi 08:26 PM, 25 జనవరి, 2026
రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం.. టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు

రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తమ పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభివృద్ధి అవకాశాలు, సమస్యల పరిష్కారాలపై దృష్టి పెట్టడంతో పాటు కేంద్రం నుంచి మరిన్ని నిధులు ఎలా రాబట్టాలనే అంశంపై ఎంపీలు ఆలోచించాలని సూచించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో సీఎం అధ్యక్షతన నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో, రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, కేంద్రంతో జరపాల్సిన సంప్రదింపులపై ఆయన దిశానిర్దేశం చేశారు.

ఉత్తరాంధ్ర–రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్, పూర్వోదయ పథకం, పోలవరం మరియు నల్లమల సాగర్ ప్రాజెక్టులను ప్రాధాన్య అంశాలుగా తీసుకోవాలని సీఎం సూచించారు. అమరావతిని రాజధానిగా చట్టబద్ధత కల్పించే బిల్లును ఈ సెషన్‌లోనే ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్రంలోని సంబంధిత మంత్రులు, అధికారులతో నిరంతర సంప్రదింపులు కొనసాగించాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంకా రావాల్సిన నిధులు, ఆర్ అండ్ ఆర్ పూర్తి అంశాలను గట్టిగా ప్రస్తావించాలని, జలవనరుల ప్రాజెక్టుల విషయంలో వివాదాలకన్నా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

పూర్వోదయ ప్రాజెక్టు కింద రూ.40 వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టే ప్రణాళికలు రూపొందించామని, రైల్వే శాఖలో అందుబాటులో ఉన్న నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం తెలిపారు. ఫ్లైఓవర్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి అవకాశాలను గుర్తించి కేంద్ర నిధులు తెచ్చుకోవాలని సూచించారు. రాష్ట్ర అంశాలతో పాటు జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై కూడా పార్లమెంట్‌లో గట్టిగా మాట్లాడాలని, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సీఎం చంద్రబాబు ఎంపీలకు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సజ్జలపై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు..

సజ్జలపై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు..

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

కేజీఎఫ్‌-2 వీడియోతో కర్ణాటక బీజేపీ పోస్ట్‌.. తీవ్ర విమర్శలు

కేజీఎఫ్‌-2 వీడియోతో కర్ణాటక బీజేపీ పోస్ట్‌.. తీవ్ర విమర్శలు

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు

ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుటీడీపీ ఎంపీలుఅమరావతిరాష్ట్రాభివృద్ధికేంద్ర నిధులుపోలవరం ప్రాజెక్టుపూర్వోదయ పథకంఅమరావతి రాజధానిపార్లమెంట్ సమావేశాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బటన్‌ బ్యాటరీలపై నిర్లక్ష్యం వద్దు.. చిన్నారుల భద్రతకు నిపుణుల కీలక సూచనలు
ఆరోగ్యం

బటన్‌ బ్యాటరీలపై నిర్లక్ష్యం వద్దు.. చిన్నారుల భద్రతకు నిపుణుల కీలక సూచనలు

తనను తానే మెరుగుపరుచుకునే ఏఐ?
టెక్నాలజీ

తనను తానే మెరుగుపరుచుకునే ఏఐ?

భారీ విస్తరణకు సిద్ధమైన లలితా జువెలరీ మార్ట్‌...
బిజినెస్

భారీ విస్తరణకు సిద్ధమైన లలితా జువెలరీ మార్ట్‌...

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..
సినిమాలు

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సెకండ్‌ సింగిల్‌ ‘యేశనగుల’..

భారీ చిత్రాలు, ఒరిజినల్ సిరీస్‌లతో సరికొత్త కంటెంట్ లైనప్‌ ప్రకటించిన జీ5
ఓటీటీ

భారీ చిత్రాలు, ఒరిజినల్ సిరీస్‌లతో సరికొత్త కంటెంట్ లైనప్‌ ప్రకటించిన జీ5

చిరంజీవి బర్త్‌డే విషెస్‌కు నాగార్జున ఎమోషనల్ రిప్లై...
సినిమాలు

చిరంజీవి బర్త్‌డే విషెస్‌కు నాగార్జున ఎమోషనల్ రిప్లై...

‘ఇరుముడి’ జోష్‌లో రెండు కొత్త సినిమాలకు రవితేజ గ్రీన్ సిగ్నల్...
సినిమాలు

‘ఇరుముడి’ జోష్‌లో రెండు కొత్త సినిమాలకు రవితేజ గ్రీన్ సిగ్నల్...

సౌత్‌ కరోలినాలో కాల్పుల కలకలం..
జనరల్

సౌత్‌ కరోలినాలో కాల్పుల కలకలం..

తమిళనాడు ముస్లిం మహిళలకు గుడ్‌న్యూస్‌..
జనరల్

తమిళనాడు ముస్లిం మహిళలకు గుడ్‌న్యూస్‌..

‘టాక్సిక్‌’ను వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’..
సినిమాలు

‘టాక్సిక్‌’ను వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’..

కాప్రా చెరువు ఇక నిమజ్జనాలకు దూరం: హైడ్రా కమిషనర్‌
జనరల్

కాప్రా చెరువు ఇక నిమజ్జనాలకు దూరం: హైడ్రా కమిషనర్‌

ఎవరెస్ట్‌ ఇంగువ విక్రయాలపై FSSAI నిషేధం..
జనరల్

ఎవరెస్ట్‌ ఇంగువ విక్రయాలపై FSSAI నిషేధం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!