

అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. తమపై దాఖలైన పిటిషన్లు చట్టబద్ధమైనవి కావని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపు జరిగితే ముందుగా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయని, అయితే తనకు మాత్రం పార్టీ నుంచి ఎలాంటి షోకాజ్ నోటీసు అందలేదని అన్నారు. అలాగే ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎందుకు పిటిషన్ దాఖలు చేయలేదని కేసీఆర్ను ప్రశ్నించారు.
అసెంబ్లీలో తాము మొత్తం 38 మంది సభ్యులమని, ఆ నేపథ్యంలో తమకు సమయం ఇవ్వాలని కోరిన విషయాన్ని కూడా కడియం గుర్తుచేశారు. బీఆర్ఎస్ఎల్పీకి తమ జీతం నుంచి ప్రతి నెల రూ.5 జమ అవుతున్నాయని, ఆ పరంగా తాము ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పారు. పార్టీ అధినాయకత్వానికి దూరంగా ఉన్నప్పటికీ ప్రజల కోసం పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఇక గతంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ నాయకత్వమే కాదా అని కడియం ప్రశ్నించారు. అప్పట్లో పార్టీ మారిన వారికి మంత్రిపదవులు కూడా ఇచ్చారని గుర్తుచేశారు. పార్టీ ఫిరాయింపులకు అసలు సూత్రదారులు మీరు కాదా అని కేసీఆర్ను ఉద్దేశించి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!