

గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న హార్ట్‌వార్మింగ్ ఎమోషనల్ డ్రామా 'హ్యాపీ జర్నీ' టీజర్ ఘనంగా విడుదలైంది. అభిరామ్ నాయుడు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణాల నేపథ్యంలో కుటుంబ బంధాలు, అనుబంధాలు, జీవిత విలువలను హృద్యంగా ఆవిష్కరించనుంది. అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రల్లో నటించగా, పృధ్వీ దండమూడి, వంశీధర్ గౌడ్, రవి శివతేజ పైలా కీలక పాత్రలు పోషించారు.
టీజర్ లాంచ్ కార్యక్రమంలో అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ, 'హ్యాపీ జర్నీ' ప్రతి కుటుంబం కలిసి థియేటర్లలో చూడదగ్గ చిత్రం అని పేర్కొన్నారు. ఆమని ఈ సినిమా తనకు మరపురాని అనుభవమని చెప్పగా, ఝాన్సీ ఈ కథ ప్రేక్షకుల హృదయాలను తాకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దర్శకుడు అభిరామ్ నాయుడు మాట్లాడుతూ, ఈ సినిమా మహిళల కోసమే కాదు, పురుషులు కూడా తప్పక చూడాల్సిన చిత్రమని అన్నారు. మహిళలు బయటకు చెప్పలేని భావోద్వేగాలను హృదయానికి హత్తుకునేలా చూపించామని, కుటుంబ సమేతంగా చూసేలా ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!