
క్రీడలు

ఏపీలో లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు జూన్ 30 (మంగళవారం) ఉదయం విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. అయితే ర్యాంకులు ఎన్ని గంటలకు విడుదల అవుతాయన్నది ఇంకా ఖరారు కాలేదు.
మే 12 నుంచి 20 వరకు జరిగిన ఈ ప్రవేశ పరీక్షకు దాదాపు 3.29 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉండటంతో పాటు సప్లిమెంటరీ, సీబీఎస్ఈ రివైజ్డ్ ఫలితాల కోసం ఎదురుచూడటంతో ఫలితాల విడుదలలో జాప్యం జరిగింది. ఇప్పుడు సీబీఎస్ఈ ప్రక్రియ తుది దశకు చేరడంతో జూన్ 30న ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!