

రాజధాని ప్రాంత రైతులు కొత్త కూటమి ప్రభుత్వాన్ని ఆశతో స్వీకరించారు. వైసీపీ పాలనలో ఎదురైన ఇబ్బందులు మర్చిపోయి, కూటమి పాలనలోనే “అంతా బాగానే ఉంటుంది” అని భావించారు. కానీ, అనుకున్నది ఒకటి, జరుగుతున్నది మరోటి అని రైతుల పరిస్థితి తేలిపోయింది. రైతులు CRDA అధికారులను, మంత్రులకు పద్దేపద్దే సమస్యలు చెప్పినప్పటికీ ఫలితం రాలేదని, రైతులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా రైతులు వీడియోలు, పోస్టులు పెట్టడం మంత్రులకు నచ్చడం లేదు. ముఖ్యంగా, మొదటి నుండి రాజధాని వ్యావహారాలను మున్సిపల్ శాఖ మంత్రిగా చూసిన మంత్రి నారాయణ ఈ విషయం పై అసహనం వ్యక్తం చేశారు.
రాజధాని రైతులు ఇటీవల సుమారు 14 రకాల సమస్యలతో సమావేశం నిర్వహించారు. సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే నెల ఉద్యమిస్తామని రైతులు హెచ్చరించారు. ఈ అంశాన్ని గుర్తించిన మంత్రి నారాయణ రాజధాని ప్రాంతంలో పర్యటన నిర్వహించారు. మంత్రుల ప్రకారం, మూడేళ్లలో రాజధానిలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. మొత్తం 69,421 ప్లాట్లలో 61,433 ప్లాట్లు ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయ్యాయని, ప్రతి రోజు 30–40 ప్లాట్లు రిజిస్టర్ అవుతున్నాయని మంత్రి తెలిపారు. కొంత మంది రైతులు తమకు కావలసిన స్పెసిఫిక్ ప్లాట్లు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న వారు తిరిగొస్తే వారి రిజిస్ట్రేషన్లు చేస్తామన్నారు. రైతులు సోషల్ మీడియాలో అనవసరంగా పోస్టులు పెట్టడం పై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించడం బాధ్యతగా ఉందని మంత్రి నారాయణ తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!