

కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, శుక్రవారం ఉదయం తన భర్త అనిల్ కుమార్ తో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం ఆమె అలిపిరి మెట్లు ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. దర్శనం అనంతరం మాట్లాడిన కవిత, గత నాలుగేళ్లుగా తాను అనుభవించిన మనోవేదన స్వామివారి కృపతో తొలగిపోయిందని తెలిపారు.
సత్యం, న్యాయం, ధర్మం తమవైపు ఉన్నాయని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని, ఇప్పుడు స్వామివారి దయతో పూర్తిగా క్లీన్ చిట్ వచ్చిందని పేర్కొన్నారు. అందుకే మొక్కు తీర్చుకోవడానికి కాలినడకన తిరుమలకు వచ్చానని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇంటి పార్టీగా పని చేసేలా త్వరలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఆ పార్టీకి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు వేరైనా ప్రజలు కలిసి సంతోషంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు వెల్లడించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!