

ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా పౌరాణిక యాక్షన్ చిత్రం గాడ్ ఆఫ్ వార్. త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పబడుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కుమారస్వామి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇదే పాత్రలో తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఒకే దైవిక పాత్రను ఈ ఇద్దరు ప్రతిభావంతులైన నటులు ఎలా ఆవిష్కరిస్తారనే చర్చ అభిమానుల్లో మొదలైంది. పౌరాణిక పాత్రల్లో కేవలం రూపం మాత్రమే కాకుండా నడక, చూపు, హావభావాలు, మాట తీరు, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా కీలకమని సినీ అభిమానులు భావిస్తున్నారు.
ఎన్టీఆర్, ధనుష్ ఇద్దరికీ నటనలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే ఇలాంటి పాత్రలో ఎవరు ఎక్కువ ప్రభావం చూపుతారనే అంశంపై అభిమానుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్‌కు అనుభవం ఉండటంతో ఆయనకు కొంత ఆధిక్యం ఉంటుందని కొందరు భావిస్తున్నారు. అయితే తెరపై కనిపించిన క్షణంలోనే ప్రేక్షకులకు దైవత్వాన్ని అనుభూతి కలిగించడం అసలైన సవాల్‌గా మారనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!