
గాసిప్స్

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అక్కడ జరగనున్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలపై న్యాయ పోరాటానికి సంబంధించిన కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన విధానాలపై కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ సమావేశానికి ముందుగానే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!