
రాజకీయాలు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మమితా బైజు జంటగా నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మంచి స్పందన అందుకుంది. క్లాస్ టచ్‌తో రూపొందిన ఈ చిత్రం సూర్య కెరీర్‌లో చెప్పుకోదగిన విజయంగా నిలిచినట్లు చిత్ర బృందం పేర్కొంది.
ఇక తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకు అక్కడ కూడా మంచి ఆదరణ లభిస్తోంది. స్ట్రీమింగ్ ప్రారంభమైన కేవలం మూడు రోజుల్లోనే 5.5 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు సమాచారం. అంతేకాకుండా గ్లోబల్ నాన్-ఇంగ్లీష్ ట్రెండింగ్ లిస్టులో టాప్ 3లో ఈ సినిమా ట్రెండ్ అవుతోంది. దీంతో థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!