
న్యూస్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు ఉదయం నుంచే కేంద్రాలకు చేరి తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. మూడు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు సాంకేతిక లోపంతో పనిచేయకపోవడంతో, వెంటనే రీప్లేస్ చేసినట్లు ఆయన వివరించారు. ఇక, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నియోజకవర్గంలో తిరుగుతున్న ముగ్గురు నాన్‌లోకల్ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు.
మరోవైపు, బీహార్ లో కూడా పోలింగ్ వేగంగా సాగుతోంది. అక్కడ ఉదయం 11 గంటల వరకు 31.38 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!