
జనరల్

నల్గొండ జిల్లా హుజుర్నగర్ నియోజకవర్గంలోని నేరేడుచర్ల మున్సిపాలిటీ 14 వ వార్డు ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి 60 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రారంభం నుంచే పోటీ హోరాహోరీగా సాగినా, చివరికి ఓటర్లు ఆమెకు మద్దతు తెలపడంతో స్పష్టమైన ఆధిక్యం లభించింది. ఈ విజయంతో జనసేన పార్టీకి స్థానిక స్థాయిలో ఉత్సాహం నింపింది.
విజయం అనంతరం ఆరూరి విజయలక్ష్మి వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి పనిచేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వార్డు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు.







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!