

ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల పట్ల జరుగుతున్న రాజకీయ చర్చ మధ్య, ప్రస్తుత ఎన్డిఏ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులపై వైఎస్సార్సీపీ క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. తమ పాలనలో ఇప్పటికే అనేక కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని వైఎస్సార్సీపీ నాయకులు చెప్పగా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సవాలు చేస్తూ, నిజమైన MoUలు ఉంటే చూపించాలని అన్నారు. నిజంగా మంచి పని చేసి ఉంటే క్రెడిట్ ఇవ్వడానికి తాను సిద్ధమని పేర్కొన్నారు.
దీనికి తోడు, వైఎస్సార్సీపీ పాలనా కాలంలో వచ్చిన కొద్దిపాటి కంపెనీలతో కూడా ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించిందని లోకేష్ తెలిపారు. పాలకులు మారినా, ప్రభుత్వ బాధ్యతలు మారవని, పరిశ్రమలతో కుదిరిన హామీలను నిలబెట్టుకోవడమే పెట్టుబడిదారుల విశ్వాసానికి కారణమవుతుందని పేర్కొన్నారు. పెట్టుబడులపట్ల లోకేష్ చూపుతున్న ఈ యాక్టివ్ దృక్పథం, గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి పూర్తి భిన్నంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.
.jpg&w=3840&q=75)


_1771477764226.jpg&w=3840&q=75)













.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!