
న్యూస్

రియాద్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ దాడి జరిగినట్లు వచ్చిన సమాచారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను ఖండించిన ఆయన, ప్రాంతీయ భద్రతకు ముప్పుగా మారే చర్యలను అమెరికా అసలు సహించదని హెచ్చరించారు. మరో నాలుగైదు వారాల పాటు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగవచ్చని పేర్కొంటూ, ఇరాన్ అణ్వాయుధాల తయారీని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండడాన్ని అమెరికా ఎప్పటికీ అంగీకరించదని ట్రంప్ స్పష్టం చేశారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతోందని, తమ హెచ్చరికలను ఇరాన్ పట్టించుకోలేదని ఆరోపించారు. అమెరికాను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం ఉన్న క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయని పేర్కొంటూ, వారి మిస్సైల్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ హెచ్చరించారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!