
జనరల్

ప్రతిపక్షాల ఇండియా కూటమి కీలక సమావేశం రేపు ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహంపై చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తాము ఇండియా కూటమిలో భాగం కాదని మరోసారి స్పష్టం చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
సమావేశంలో పాల్గొనేందుకు మమతా బెనర్జీ ఢిల్లీకి బయలుదేరారు. తృణమూల్ కాంగ్రెస్ ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమిష్టి పోరాటానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇస్తోంది. ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసే దిశగా ఈ సమావేశం కీలకంగా మారే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!