
జనరల్

పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరోసారి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో విద్యార్థులంతా తమ ఇళ్లకు వెళ్లాలని, వారి భద్రత గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని సూచించారు. ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యులపై కేంద్ర ప్రభుత్వం తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.
విద్యార్థుల భద్రత, విద్య ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రధాని ఇప్పటికే స్పందించారని, దోషులపై కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ కుటుంబ సభ్యుల వద్దకు తిరిగి వెళ్లి, న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!