
జనరల్

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నీట్-యూజీ 2026 పేపర్ లీకేజీ వివాదంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించిన ఆమె, విద్యార్థుల వాదనలు వినాలని, దేశ విద్యా వ్యవస్థలో తక్షణ సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. పోటీ పరీక్షల్లో పారదర్శకత అవసరమని ఆమె స్పష్టం చేసింది.
ఏళ్ల తరబడి కష్టపడి సిద్ధమైన విద్యార్థులు అనిశ్చితిని ఎదుర్కొవడం బాధాకరమని పేర్కొంటూ, విద్యార్థుల పట్ల సానుభూతి వ్యక్తం చేసింది. శాంతియుత మార్గంలో సమస్య పరిష్కారం కావాలని ఆమె పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద న్యూ ఢిల్లీ లో నిరసనలు కొనసాగుతున్నాయి. పేపర్ లీక్‌పై బాధ్యత వహించాలని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!