9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి.. హైదరాబాద్‌లో ఇండియా కూటమి ఆందోళన

Writer: Nithish 05:39 AM, 9 అక్టోబర్, 2026
జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి.. హైదరాబాద్‌లో ఇండియా కూటమి ఆందోళన

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇండియా కూటమి పక్షాలు గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘చలో లోక్‌భవన్‌’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్‌, వామపక్షాలు, తెలంగాణ జనసమితి, సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు నగరంతో పాటు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. నెక్లెస్‌ రోటరీలోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఖైరతాబాద్‌ మీదుగా లోక్‌భవన్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తూ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోక్‌భవన్‌లోకి వెళ్లకుండా పోలీసులు మూడు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయడంతో నాయకులు, కార్యకర్తలు వాటిని దాటేందుకు ప్రయత్నించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాకు వినతిపత్రం సమర్పించేందుకు అనుమతించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కోరగా, భద్రతా కారణాలతో పోలీసులు అనుమతించలేదు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు ప్రకటించారు. తరువాత వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఆందోళన కారణంగా జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ నుంచి లోక్‌భవన్‌ వైపు వెళ్లే మార్గాల్లో ఆంక్షలు విధించడంతో అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, లక్డీకాపూల్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట పరిసరాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు చోరీ ఆరోపణలపై ప్రజల్లోకి వెళ్లేందుకు ‘ఓటు బచావో–దేశ్‌ బచావో’ నినాదంతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైకాపా పాలనలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా - విజయసాయిరెడ్డి

వైకాపా పాలనలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా - విజయసాయిరెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే విజయం: పొంగులేటి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే విజయం: పొంగులేటి

స్థానిక ఎన్నికలకు వైకాపా అడ్డంకులు సృష్టిస్తోంది: కాలవ శ్రీనివాసులు

స్థానిక ఎన్నికలకు వైకాపా అడ్డంకులు సృష్టిస్తోంది: కాలవ శ్రీనివాసులు

ఓట్ల తొలగింపుపై మోదీ సమాధానం చెప్పాలి: రేవంత్‌రెడ్డి

ఓట్ల తొలగింపుపై మోదీ సమాధానం చెప్పాలి: రేవంత్‌రెడ్డి

జూరాల నీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు

జూరాల నీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు

ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌

ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌

ట్యాగ్లు
జ్ఞానేశ్‌ కుమార్‌ఇండియా కూటమి నిరసనచలో లోక్‌భవన్‌హైదరాబాద్‌ ఆందోళనతెలంగాణ కాంగ్రెస్‌మహేశ్‌కుమార్‌ గౌడ్‌పొన్నం ప్రభాకర్‌ఓటు బచావో దేశ్‌ బచావోలోక్‌భవన్‌తెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మైక్రోసాఫ్ట్‌, టాటా సహా 8 ఐటీ కంపెనీలపై అమెరికా చర్యలు
జనరల్

మైక్రోసాఫ్ట్‌, టాటా సహా 8 ఐటీ కంపెనీలపై అమెరికా చర్యలు

డీబీటీతో నిధుల లీకేజీలకు అడ్డుకట్ట: ప్రధాని మోదీ
జనరల్

డీబీటీతో నిధుల లీకేజీలకు అడ్డుకట్ట: ప్రధాని మోదీ

బెంగళూరులో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసన.. జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామాకు డిమాండ్‌
జనరల్

బెంగళూరులో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసన.. జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామాకు డిమాండ్‌

ప్రపంచాన్ని వణికించనున్న ఎల్‌నినో.. తీవ్ర వేడిపై ఆందోళన
జనరల్

ప్రపంచాన్ని వణికించనున్న ఎల్‌నినో.. తీవ్ర వేడిపై ఆందోళన

ఏపీలో భారీ వృద్ధి లక్ష్యం.. చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

ఏపీలో భారీ వృద్ధి లక్ష్యం.. చంద్రబాబు కీలక ప్రకటన

వైకాపా పాలనలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా - విజయసాయిరెడ్డి
రాజకీయాలు

వైకాపా పాలనలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా - విజయసాయిరెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే విజయం: పొంగులేటి
రాజకీయాలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే విజయం: పొంగులేటి

పోలవరం ప్రాజెక్టును 2027 చివరి నాటికి పూర్తి చేస్తాం - నిమ్మల
జనరల్

పోలవరం ప్రాజెక్టును 2027 చివరి నాటికి పూర్తి చేస్తాం - నిమ్మల

కామ్రేడ్ కళ్యాణ్ ఫస్ట్ టాక్
సినిమాలు

కామ్రేడ్ కళ్యాణ్ ఫస్ట్ టాక్

స్థానిక ఎన్నికలకు వైకాపా అడ్డంకులు సృష్టిస్తోంది: కాలవ శ్రీనివాసులు
రాజకీయాలు

స్థానిక ఎన్నికలకు వైకాపా అడ్డంకులు సృష్టిస్తోంది: కాలవ శ్రీనివాసులు

గోదావరి–కావేరి అనుసంధానానికి చర్యలు తీసుకోండి: మోదీకి చంద్రబాబు విజ్ఞప్తి
జనరల్

గోదావరి–కావేరి అనుసంధానానికి చర్యలు తీసుకోండి: మోదీకి చంద్రబాబు విజ్ఞప్తి

స్విట్జర్లాండ్‌లో తెలుగు సంస్కృతిని కాపాడటం అభినందనీయం
జనరల్

స్విట్జర్లాండ్‌లో తెలుగు సంస్కృతిని కాపాడటం అభినందనీయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!