
క్రీడలు

హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన అండాల అక్రమ సేకరణ కేసులో డాక్టర్లకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో డాక్టర్ పద్మజ, డాక్టర్ దుర్గారావు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుతో పిటిషనర్లకు ఎలాంటి సంబంధం లేదని వారి తరఫు న్యాయవాదులు వాదించారు.
మరోవైపు, అమాయక యువతులకు హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి వారి నుంచి అండాలు సేకరించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావు కోర్టుకు వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం హైకోర్టు డాక్టర్ పద్మజ, డాక్టర్ దుర్గారావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!