23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రభుదేవా, మంచు విష్ణు కాంబినేషన్‌లో ‘వీఎం 24’

Writer: Pooja 04:34 PM, 23 నవంబర్, 2026
ప్రభుదేవా, మంచు విష్ణు కాంబినేషన్‌లో ‘వీఎం 24’

ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా మరోసారి మెగాఫోన్‌ పట్టేందుకు సిద్ధమయ్యారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించి విజయాలు అందుకున్న ఆయన.. తాజాగా మంచు విష్ణుతో ఓ కొత్త సినిమాను తెరకెక్కించబోతున్నారు. 2021లో సల్మాన్‌ ఖాన్‌ కథానాయకుడిగా వచ్చిన ‘రాధే’ చిత్రానికి దర్శకత్వం వహించిన తరువాత ప్రభుదేవా నుంచి మరో సినిమా రాలేదు. దాదాపు ఐదేళ్ల విరామం తరువాత ఆయన దర్శకత్వంలో రాబోతున్న ఈ ప్రాజెక్టుపై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ప్రస్తుతం ‘వీఎం 24’ అనే వర్కింగ్‌ టైటిల్‌ను ఖరారు చేశారు.

నవంబరు 23న మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ప్రభుదేవా సామాజిక మాధ్యమాల వేదికగా ఈ సినిమా గురించి వెల్లడించారు. విష్ణుతో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ.. ‘‘నా హీరో, తమ్ముడు మంచు విష్ణుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘వీఎం 24’తో ఈ వేడుకలు మరింత ప్రత్యేకంగా మారాయి’’ అని పేర్కొన్నారు. ఈ పోస్టుతో ఇద్దరి కలయికలో సినిమా రాబోతున్న విషయం అధికారికంగా వెలుగులోకి వచ్చింది. అయితే, చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు, నిర్మాణ సంస్థ తదితర విషయాలను చిత్ర బృందం ఇంకా వెల్లడించలేదు.

సమాచారం ప్రకారం ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందించనున్నారు. ఇందులో మంచు విష్ణు సరికొత్త లుక్‌లో కనిపించేందుకు శారీరకంగా ప్రత్యేకంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సినిమా కోసం ఆయన తన రూపురేఖల్లో మార్పులు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నటించనున్న కథానాయిక, ఇతర తారాగణం, సాంకేతిక బృందం, షూటింగ్‌ ప్రారంభ తేదీ వంటి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు నటించనున్న ఈ కొత్త ప్రాజెక్టుపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒక్క సీన్‌ కోసం సూర్య 20 టేక్స్‌

ఒక్క సీన్‌ కోసం సూర్య 20 టేక్స్‌

నాగచైతన్యకు శోభిత రొమాంటిక్ బర్త్‌డే విషెస్

నాగచైతన్యకు శోభిత రొమాంటిక్ బర్త్‌డే విషెస్

కర్ణాటకలో ‘రామాయణం’ సరికొత్త రికార్డు

కర్ణాటకలో ‘రామాయణం’ సరికొత్త రికార్డు

సద్గురు పాదాలకు నమస్కరించిన తమన్నా.. వైరల్‌గా మారిన వీడియో

సద్గురు పాదాలకు నమస్కరించిన తమన్నా.. వైరల్‌గా మారిన వీడియో

పూజా కార్యక్రమాలతో కిరణ్ అబ్బవరం కొత్త మూవీకి శ్రీకారం

పూజా కార్యక్రమాలతో కిరణ్ అబ్బవరం కొత్త మూవీకి శ్రీకారం

భోగి కథ విని శర్వానంద్ షాక్.. తననే ఎందుకు ఎంచుకున్నారో చెప్పిన సంపత్ నంది!

భోగి కథ విని శర్వానంద్ షాక్.. తననే ఎందుకు ఎంచుకున్నారో చెప్పిన సంపత్ నంది!

ట్యాగ్లు
ప్రభుదేవామంచు విష్ణువీఎం 24పాన్ ఇండియా సినిమాయాక్షన్ థ్రిల్లర్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల జోరు.. సెమీఫైనల్‌కు అర్హత
క్రీడలు

ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల జోరు.. సెమీఫైనల్‌కు అర్హత

రిషబ్‌ పంత్‌ నా మెంటార్‌ - ధ్రువ్‌ జురెల్‌
క్రీడలు

రిషబ్‌ పంత్‌ నా మెంటార్‌ - ధ్రువ్‌ జురెల్‌

గ్లోబల్ సమిట్‌ ఏర్పాట్లపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
జనరల్

గ్లోబల్ సమిట్‌ ఏర్పాట్లపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

ఈ ఆదివారం స్టార్ మా‌లో ‘బ్లాస్ట్’ సినిమా సందడి
షోస్

ఈ ఆదివారం స్టార్ మా‌లో ‘బ్లాస్ట్’ సినిమా సందడి

‘జ్వాలా ఎంకే-1’ డ్రోన్ వ్యవస్థ పరీక్ష విజయవంతం!
జనరల్

‘జ్వాలా ఎంకే-1’ డ్రోన్ వ్యవస్థ పరీక్ష విజయవంతం!

ప్రభుదేవా, మంచు విష్ణు కాంబినేషన్‌లో ‘వీఎం 24’
సినిమాలు

ప్రభుదేవా, మంచు విష్ణు కాంబినేషన్‌లో ‘వీఎం 24’

వైద్యం నుంచి వ్యవసాయం వరకు ఏఐ వినియోగం.. చంద్రబాబు కీలక ఆదేశాలు
జనరల్

వైద్యం నుంచి వ్యవసాయం వరకు ఏఐ వినియోగం.. చంద్రబాబు కీలక ఆదేశాలు

అండాల అక్రమ సేకరణ కేసు.. ఇద్దరు డాక్టర్ల ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత!
జనరల్

అండాల అక్రమ సేకరణ కేసు.. ఇద్దరు డాక్టర్ల ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత!

ఆరేళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. భర్తకు విడాకులు ఇవ్వనున్న సప్నా చౌదరి
గాసిప్స్

ఆరేళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. భర్తకు విడాకులు ఇవ్వనున్న సప్నా చౌదరి

కార్తిక పౌర్ణమి దీపారాధన గురించి స్కాందపురాణం ఏం చెబుతోంది?
జనరల్

కార్తిక పౌర్ణమి దీపారాధన గురించి స్కాందపురాణం ఏం చెబుతోంది?

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.. లోగో, ట్యాగ్‌లైన్ పోటీలకు ఆహ్వానం!
రాజకీయాలు

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.. లోగో, ట్యాగ్‌లైన్ పోటీలకు ఆహ్వానం!

కరీంనగర్‌లో భాజపా నేతల భారీ పాదయాత్ర
రాజకీయాలు

కరీంనగర్‌లో భాజపా నేతల భారీ పాదయాత్ర

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!