
జనరల్

రాజ్యసభకు జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం శ్రీ లింగమనేని రమేష్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాజ్యసభ వేదికగా నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు గారు రమేష్ అభ్యర్థిత్వాన్ని స్వాగతించారు. ఆయన సరైన వ్యక్తి అని, ఈ ఎంపిక పట్ల పార్టీ శ్రేణులంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!