

ఇంటి కలను నెరవేర్చుకోవడం మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి కుటుంబాల పెద్ద ఆశ. అయితే ఆర్థిక సమస్యల వల్ల చాలా మంది తమ సొంతంగా ఇల్లు నిర్మించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం ద్వారా గృహనిర్మాణానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం గురించి అవగాహన ఇంకా తక్కువగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని, ఉండి నియోజకవర్గ MLA మరియు ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు వీడియో సందేశం ద్వారా ప్రజలకు కీలక సమాచారం అందించారు.
పాత్రత గల లబ్ధిదారులు తమ స్వంత భూమిపై గానీ, ప్రభుత్వము కేటాయించిన భూమిపై గానీ ఇల్లు నిర్మించుకుంటే, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో ₹2.5 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని ఆయన తెలిపారు. నవంబర్ 30 లోపు గ్రామ లేదా వార్డు కార్యాలయాల్లో నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడికి ఇల్లు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజాప్రతినిధుల ఈ ప్రయత్నం ప్రశంసనీయమని భావిస్తున్నారు.

.png&w=3840&q=75)











.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!