

హిమంత బిశ్వ శర్మ మంగళవారం అస్సాం ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. గువాహటిలోని వెటర్నరీ కాలేజీ ఫీల్డ్‌లో ఉదయం 11:40 గంటలకు జరిగిన కార్యక్రమంలో అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. హిమంత బిశ్వ శర్మతో పాటు రామేశ్వర్ తేలి, అతుల్ బోరా, చరణ్ బోరో, అజంతా నియోగ్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
అస్సాంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం విశేషం. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహా పలువురు ఎన్డీయే నేతలు హాజరయ్యారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అభివృద్ధి చెందిన, సుసంపన్నమైన అస్సాంను నిర్మించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని శర్మ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!