

అనిల్ విజ్ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ రాజకీయంగా పోరాడే హక్కు ఉందని పేర్కొన్న ఆయన, బొద్దింకను మురికి కీటకంగా అభివర్ణిస్తూ అలాంటి పేరుతో పార్టీ కొనసాగడం కంటే పేరు మార్చుకోవడం మంచిదని సూచించారు. చిన్న పిల్లవాడు కూడా కాలితో నలిపేయగల కీటకాన్ని పార్టీ పేరుగా ఎంచుకోవడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు.
మరోవైపు అభిజీత్ దీప్కే యువత పాత్రపై దృష్టి సారించారు. శంభాజీనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో లోపాలు, పేపర్ లీకేజీలు వంటి అంశాలపై యువత ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేళ్లకు ఒకసారి ఓటు వేయడం మాత్రమే ప్రజాస్వామ్యం కాదని, ఎన్నికైన ప్రజాప్రతినిధులను జవాబుదారులుగా నిలబెట్టడం కూడా పౌరుల బాధ్యతేనని పేర్కొన్నారు. యువత గళం విప్పినప్పుడే వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!