

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో రేవంత్ అబద్ధాలు చెప్పారని, అసభ్యకరమైన భాషలో మాట్లాడారని వారు ఆరోపించారు. ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలో నాలుక కోస్తానంటూ మాట్లాడటం సరికాదని, సభ్య సమాజం దీన్ని క్షమించదని హరీష్ రావు అన్నారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఎన్జీటీ స్టే వచ్చిందని రేవంత్ ప్రకటించడాన్ని హరీష్ రావు తప్పుబట్టారు. బీఆర్ఎస్ పోరాట ఫలితంగానే ఈ స్టే వచ్చిందని, తమ ఘనకార్యాన్ని రేవంత్ తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో కేసీఆర్పై రేవంత్ చేసిన విమర్శలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ దశాబ్దాలుగా ద్రోహం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణ సాధించారని, అధికార మదంతో అసభ్యంగా మాట్లాడటం సరికాదని కేటీఆర్ అన్నారు. పదే పదే కేసీఆర్ చావు కోరుకునే రాబందు లాంటివాడు రేవంత్ అని ఆయన వ్యాఖ్యానించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!