

న్యూఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. విదేశీ పర్యటనకు బయలుదేరుతున్న నేపథ్యంలో ఆమెకు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి ఝాన్సీ రాజేందర్ రెడ్డి మీనాక్షి నటరాజన్‌ను కలసి అంబేద్కర్ పుస్తకాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విదేశీ పర్యటన విజయవంతంగా పూర్తిచేసుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో మీనాక్షి నటరాజన్ అందిస్తున్న నాయకత్వం, మార్గదర్శకత్వం పార్టీ సంస్థాగత కార్యక్రమాలకు దోహదపడుతోందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆప్యాయ వాతావరణంలో జరిగిన ఈ భేటీ కాంగ్రెస్ నాయకుల మధ్య సమన్వయాన్ని ప్రతిబింబించింది. మీనాక్షి నటరాజన్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లనున్నట్లు ఇటీవలి నివేదికలు వెల్లడించాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!