

విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి కలిసి పనిచేస్తున్న చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నం: 47 – AK 47. ఈసారి హీరోగా వెంకటేశ్, దర్శకుడిగా త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 2026 అక్టోబర్ 2న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే టీజర్‌ను విడుదల చేయగా.. సినిమాపై ఆసక్తి నెలకొంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో త్వరలోనే ప్రమోషన్స్‌ను మరింత జోరుగా నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఫస్ట్ సింగిల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో డింపుల్ హయాతి స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారనే వార్తలు ప్రస్తుతం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్, నారా రోహిత్, రావు రమేశ్, సత్య తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!