
న్యూస్

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారికి ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున అందజేయాలని నిర్ణయించింది. ఒకే కుటుంబంలో ముగ్గురికంటే ఎక్కువ మంది ఉంటే, వారికి గరిష్టంగా రూ.3000 వరకు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. బాధితులు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లే ముందు ఈ నగదు అందజేయనున్నారు. ఈ చర్యతో తాత్కాలిక సహాయం అంది ప్రజలకు కొంత ఊరట లభిస్తుందని అధికారులు తెలిపారు.











కామెంట్స్ (2)
great leader 👏👏👏
ఇంకా ఎక్కువ సాయం ఇవ్వాలి అనిపిస్తోంది