
ఆరోగ్యం

మెదక్‌లో మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న తనకు సిట్ నోటీసులు అందాయని, నేడు కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఇది ప్రజల దృష్టిని మళ్లించేందుకే జరుగుతున్న చర్యలని ఆయన ఆరోపించారు. బొగ్గు స్కామ్‌పై సమాధానం చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదని విమర్శించారు.
ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడబోమని హరీష్ రావు స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసే వరకు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని, ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!