22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎంపీపీ ఎన్నికల్లో కుటుంబ రాజకీయాల హవా..

Writer: Chandrika 09:31 AM, 20 నవంబర్, 2026
ఎంపీపీ ఎన్నికల్లో కుటుంబ రాజకీయాల హవా..

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎంపీపీ ఎన్నికలు పలు ఆసక్తికర పరిణామాలకు వేదికయ్యాయి. పలుచోట్ల సిట్టింగ్, మాజీ ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులు మండల పరిషత్‌ పీఠాలను దక్కించుకున్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తల్లి కృష్ణవేణి రాజవొమ్మంగి ఎంపీపీగా ఎన్నికవగా.. ఆమె భర్త విజయభాస్కర్‌ అదే మండలంలో జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం ఎంపీపీగా మాజీ మంత్రి, మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కుమారుడు మోపిదేవి రాజీవ్‌ ఎన్నికయ్యారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్‌ సోదరుడు నిధి కార్వేటినగరం ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులో జి. విజయలక్ష్మి ఎంపీపీగా, ఆమె భర్త కృష్ణమూర్తి వైస్‌ ఎంపీపీగా ఎన్నికయ్యారు. మార్కాపురం జిల్లా పుల్లలచెరువులో కాకర్ల వరలక్ష్మి, ఆమె భర్త కోటయ్య కూడా ఇదే తరహాలో రెండు పదవులను దక్కించుకున్నారు. శింగనమలలో వైఎస్సార్‌సీపీ సభ్యులు సమావేశం నుంచి బయటకు వెళ్లడంతో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులు టీడీపీకి దక్కాయి. కృష్ణా జిల్లా మొవ్వలో టీడీపీ నుంచి గెలిచిన తాతా రత్నమాణిక్యం, పొత్తులో భాగంగా ఎంపీపీ పదవిని BJPకి కేటాయించడంతో ఆ పార్టీలో చేరి ఎంపీపీగా ఎన్నికయ్యారు.

మరోవైపు పలు మండలాల్లో పార్టీల మధ్య సయోధ్యలు, పరస్పర మద్దతు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశాయి. అన్నమయ్య జిల్లా రామసముద్రంలో వైఎస్సార్‌సీపీ సభ్యురాలి మద్దతుతో కూటమికి ఎంపీపీ పదవి దక్కింది. పోలవరం జిల్లా వై. రామవరంలో టీడీపీ అభ్యర్థి పల్లాల వెంకటమణారెడ్డికి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలు మద్దతు తెలపడంతో ఆయన విజయం సాధించారు. ఎటపాకలో వైఎస్సార్‌సీపీ, సీపీఐ, కాంగ్రెస్‌ మద్దతుతో సీపీఎం అభ్యర్థి రామారావు ఎంపీపీగా ఎన్నికయ్యారు. ద్వారకాతిరుమలలో పొత్తులో భాగంగా BJP అభ్యర్థి బోడపాటి లిల్లీపుష్పకు ఎంపీపీ పదవి దక్కింది. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో వైస్‌ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలతో టీడీపీ అభ్యర్థి సత్యవతి విజయం సాధించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరులో వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆలయంలో ప్రమాణం చేసి అనూషను ఎంపీపీగా, శిల్పను వైస్‌ ఎంపీపీగా గెలిపించాలని నిర్ణయించుకున్నారు. కాకినాడ జిల్లా రౌతులపూడిలో అక్కాతమ్ముళ్లు తమరాల సత్యనారాయణ, నందిపల్లి యరకయ్యమ్మ ఎంపీటీసీలుగా గెలవగా.. సత్యనారాయణ ఎంపీపీగా ఎన్నికయ్యారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

బెంగళూరుకు చేరుకున్న వైఎస్‌ షర్మిల.. ప్యాలెస్‌ వద్ద పోలీసుల హై అలర్ట్‌

బెంగళూరుకు చేరుకున్న వైఎస్‌ షర్మిల.. ప్యాలెస్‌ వద్ద పోలీసుల హై అలర్ట్‌

‘సర్‌’ను అడ్డుకునేవాళ్లు దేశద్రోహులే- బండి సంజయ్‌

‘సర్‌’ను అడ్డుకునేవాళ్లు దేశద్రోహులే- బండి సంజయ్‌

ట్యాగ్లు
: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలుఎంపీపీ ఎన్నికలుటీడీపీవైఎస్సార్‌సీపీBJPజనసేనసీపీఎంరాజకీయ పొత్తులుస్థానిక సంస్థల ఎన్నికలుకుటుంబ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం..
జనరల్

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం..

యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా వైఎస్ షర్మిలను అడ్డుకున్న బెంగళూరు పోలీసులు
రాజకీయాలు

యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా వైఎస్ షర్మిలను అడ్డుకున్న బెంగళూరు పోలీసులు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!