

ఈ తరం రాజకీయ నాయకుల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానం పొందారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని పవన్ ఎల్లప్పుడూ తాపత్రాయపడతారు. అనుక్షణం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ముక్కుసూటిగా మాట్లాడే పవన్, తప్పు చేస్తే తననైనా నిలదీయాలని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. తాజాగా కూడా అదే తరహా వ్యాఖ్యలతో పవన్ తన రాజకీయ నైతికతను నిరూపించారు. యువత నాయకులను పరీక్షించాలి, ప్రతి రాజకీయ నాయకుడు జవాబుదారీగా ఉండాలి అని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పవన్ వ్యాఖ్యల ప్రకారం, నాయకులు బాధ్యతాయుతమైన యువతకు మాత్రమే భయపడతారు. ఇది తనకూ, ముఖ్యమంత్రి గారికి కూడా వర్తిస్తుందని గుర్తు చేశారు. శాసన సభలో తాము చెప్పిన విషయాలను గుర్తు చేసి, తప్పు చేసినా బాధ్యత వహిస్తామని పవన్ స్పష్టం చేశారు. తాము తప్పు చేసినవారిని ఉపేక్షించవోమని కూడా తెలిపారు.
కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, నాయకుల పనితీరుపై ప్రశ్నించే బాధ్యత యువతపై ఉందని పవన్ అన్నారు. నేటి ప్రపంచంలో, చాలా మంది బాధ్యత నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు, తప్పులను అంగీకరించి, జవాబుదారీతనం కోసం పట్టుబట్టే పవన్ లాంటి నాయకులు చాలా అరుదు. అందుకే పవన్‌కు తటస్థులు కూడా మద్దతు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!