
జనరల్

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు సంబంధించిన నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రెండు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలోని ఆమెకు సంబంధించిన రైస్ మిల్లులో లెక్కలు తేలని 9,639.962 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో సివిల్ సప్లయ్స్ అధికారులు కీలక వివరాలను గుర్తించారు.
రబీ 2022-23, 2023-24, 2024-25 సీజన్లకు సంబంధించి మొత్తం రూ.40.96 కోట్ల విలువైన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ధాన్యంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై గతంలోనే రేఖా నాయక్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS), నిత్యావసర సరుకుల చట్టం కింద కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టి సోదాలు నిర్వహిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!