

కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకులు శంకర్, ఏ.ఆర్. మురుగదాస్ కలిసి ఓ కొత్త ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. శంకర్ రచనా బృందం సిద్ధం చేసిన ఓ కథకు మురుగదాస్ స్క్రిప్ట్‌లో మార్పులు, చేర్పులు చేస్తున్నారనే సమాచారం వినిపిస్తోంది. ఈ ఇద్దరి కలయిక నిజమైతే తమిళ సినీ పరిశ్రమలోనే అరుదైన కాంబినేషన్‌గా నిలిచే అవకాశం ఉంది. భారీ స్థాయి విజువల్స్, గ్రాండ్ స్కేల్ చిత్రీకరణలో శంకర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండగా.. బలమైన కమర్షియల్ కథలను తెరకెక్కించడంలో మురుగదాస్‌కు మంచి పేరుంది.
అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి దర్శకుడు ఎవరు, కథను ఎవరు అందిస్తున్నారు అనే విషయాల్లో ఇప్పటివరకు స్పష్టత లేదు. శంకర్ దర్శకత్వంలో మురుగదాస్ కథ అందిస్తారా? లేక మురుగదాస్ దర్శకత్వంలో శంకర్ కథకు సహకరిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. నిర్మాతలు లేదా దర్శకుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ప్రస్తుతానికి ఇది పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారంగానే పరిగణించాలి. అయితే ఈ కాంబినేషన్ నిజమై ప్రాజెక్ట్ పట్టాలెక్కితే.. భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ఆసక్తికరమైన కలయికల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!