
క్రీడలు

తెలంగాణ రాష్ట్రంలో 2027 జనగణన నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన కార్యాచరణను అధికారులు వివరించారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో ఇంటింటి వివరాల సేకరణను మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
మొదటి దశలో గృహ వివరాల సేకరణకు 34 ప్రశ్నల నమూనాను ఉపయోగించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియలో గణన సిబ్బంది, నియామక అధికారులు కలిపి సుమారు 89 వేల మంది పాల్గొననున్నారు. రెండో దశ జనగణన ప్రక్రియను 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!