
క్రీడలు

కేటీ రామారావుపై క్రిమినల్ కేసు నమోదు కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హనుమకొండలో నిర్వహించిన ‘రైతు సంగ్రామ సదస్సు’లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్‌లోని సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు బీఎన్ఎస్ చట్టంలోని 504, 505 సెక్షన్ల కింద కేటీఆర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!