
రాజకీయాలు

నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామిరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి విజయం సాధిస్తారనే ఆశాభావాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో సర్వోత్తమ్‌రెడ్డి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై అవగాహన, పార్టీ పట్ల నిబద్ధత ఆయనకు బలమని పేర్కొన్నారు.
పట్టభద్రులు, ఉద్యోగ వర్గాలతో సర్వోత్తమ్‌రెడ్డికి ఉన్న అనుబంధం ఎన్నికల్లో కలిసి వస్తుందని పొంగులేటి అన్నారు. శాసన మండలిలో పట్టభద్రుల సమస్యలను బలంగా వినిపించేందుకు ఆయనకు అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలిపి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!