25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హనుమకొండలో కొనసాగుతున్న ఉద్రిక్తత..భారీగా పోలీసు బలగాల మోహరింపు

Writer: Pooja 12:49 PM, 25 నవంబర్, 2026
హనుమకొండలో కొనసాగుతున్న ఉద్రిక్తత..భారీగా పోలీసు బలగాల మోహరింపు

హనుమకొండలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్నటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి తమ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్న బీఆర్ఎస్ జనచైతన్య సభ విజయవంతం కావడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. హనుమకొండలో ఎమ్మెల్యే నియంతృత్వ ధోరణి కొనసాగుతోందని ఆరోపించిన ఆయన, ఎమ్మెల్యేకు, ఆయనకు సహకరిస్తున్న పోలీసులకు కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు. రాయలసీమ సంస్కృతిని ఇక్కడికి తీసుకురావాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ దాడులను తిప్పికొడతామని స్పష్టం చేశారు.

మరోవైపు తన క్యాంప్ కార్యాలయంపై దాడికి యత్నించడం దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమని తాను సవాల్ విసిరితే, దానికి స్పందించకుండా ధర్నా పేరుతో క్యాంప్ కార్యాలయంపై దాడికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఘటన జరిగిన సమయంలో తాను క్యాంప్ కార్యాలయంలో లేనని, తన కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నారని తెలిసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి వచ్చి దాడికి ప్రయత్నించాయని ఆరోపించారు. కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న సమయంలో క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగడం అత్యంత దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. అభివృద్ధిపై చర్చకు ముందుకు రావాల్సింది పోయి, ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.

కాగా, అభివృద్ధిపై చర్చకు సంబంధించి ఇరుపార్టీల నాయకుల మధ్య వివాదం తలెత్తడంతో నిన్న హనుమకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వినయ్ భాస్కర్ విసిరిన సవాల్‌కు స్పందిస్తూ కాంగ్రెస్ నేతలు హనుమకొండ చౌరస్తాకు చేరుకోగా, ఎమ్మెల్యే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు సమీపంలోనే ఉండటంతో ఇరుపార్టీల కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పరస్పరం రాళ్లు, కోడిగుడ్లు విసురుకోవడంతో పాటు ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి లాఠీఛార్జ్ చేశారు. నిన్నటి ఘటనల నేపథ్యంలో ఈరోజు కూడా పోలీసులు అప్రమత్తంగా ఉంటూ హనుమకొండలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి - కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి - కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు కాకముందే అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్ యాదవ్

కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు కాకముందే అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్ యాదవ్

రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట..!

రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట..!

స్వదేశానికి హసీనా రాకపై ఉత్కంఠ.. అరెస్ట్ తప్పదంటున్న బంగ్లాదేశ్!

స్వదేశానికి హసీనా రాకపై ఉత్కంఠ.. అరెస్ట్ తప్పదంటున్న బంగ్లాదేశ్!

నేడు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాల విడుదల

నేడు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాల విడుదల

ఓట్ల కోసం హైదరాబాద్‌కు వెళ్లిన సర్పంచి అభ్యర్థి..వలస ఓటర్లకు ఆహ్వానం

ఓట్ల కోసం హైదరాబాద్‌కు వెళ్లిన సర్పంచి అభ్యర్థి..వలస ఓటర్లకు ఆహ్వానం

ట్యాగ్లు
హనుమకొండ ఘర్షణలుబీఆర్ఎస్ కాంగ్రెస్ వివాదంవినయ్ భాస్కర్నాయిని రాజేందర్ రెడ్డితెలంగాణ రాజకీయాలుపోలీసుల భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కార్తిక దీపం వివాదంపై సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం వివరణ
జనరల్

కార్తిక దీపం వివాదంపై సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం వివరణ

గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి - కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
రాజకీయాలు

గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి - కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

‘నో టు డ్రగ్స్‌ – ఎస్‌ టు లైఫ్‌’.. యువతకు హీరో వెంకటేశ్‌ పిలుపు
జనరల్

‘నో టు డ్రగ్స్‌ – ఎస్‌ టు లైఫ్‌’.. యువతకు హీరో వెంకటేశ్‌ పిలుపు

ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టులో ఊరట నిరాకరణ
జనరల్

ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టులో ఊరట నిరాకరణ

తెలంగాణకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ మృతి
జనరల్

తెలంగాణకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ మృతి

కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు కాకముందే అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్ యాదవ్
రాజకీయాలు

కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు కాకముందే అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్ యాదవ్

హనుమకొండలో కొనసాగుతున్న ఉద్రిక్తత..భారీగా పోలీసు బలగాల మోహరింపు
రాజకీయాలు

హనుమకొండలో కొనసాగుతున్న ఉద్రిక్తత..భారీగా పోలీసు బలగాల మోహరింపు

75వ మిస్ యూనివర్స్ కిరీటం ప్యూర్టోరికో సొంతం..
జనరల్

75వ మిస్ యూనివర్స్ కిరీటం ప్యూర్టోరికో సొంతం..

పౌల్ట్రీ పరిశ్రమకు ప్రాధాన్యత రంగం హోదా.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
జనరల్

పౌల్ట్రీ పరిశ్రమకు ప్రాధాన్యత రంగం హోదా.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

సంక్రాంతి బరిలోకి మళ్లీ చిరంజీవి ‘విశ్వంభర’..
సినిమాలు

సంక్రాంతి బరిలోకి మళ్లీ చిరంజీవి ‘విశ్వంభర’..

చలికాలంలో ఫిట్‌గా ఉండాలంటే ఈ వ్యాయామాలు చేయండి.. వైద్యుల సూచన!
ఆరోగ్యం

చలికాలంలో ఫిట్‌గా ఉండాలంటే ఈ వ్యాయామాలు చేయండి.. వైద్యుల సూచన!

దలైలామా వారసత్వంపై చర్చలు..
జనరల్

దలైలామా వారసత్వంపై చర్చలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!