

టాలీవుడ్ యంగ్ హీరో ప్రిన్స్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు, న్యూజిలాండ్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ సాయి మాచిరాజును ఆగస్టు 24న వివాహం చేసుకున్నారు. ఇరువైపుల పెద్దల అంగీకారంతో న్యూజిలాండ్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది.
పెళ్లికి సంబంధించిన ఫొటోలను ప్రిన్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. జీవితకాలపు కొత్త బంధానికి స్వాగతం అంటూ ఆయన చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. పెళ్లి ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో అభిమానులు, తోటి నటీనటులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రిన్స్, సాయి మాచిరాజు పరిచయం ఓ సాధారణ స్నేహితుడి పెళ్లి వేడుకలో జరిగినట్లు తెలుస్తోంది. ఆ పరిచయం స్నేహంగా మారి, అనంతరం ప్రేమగా మారింది. ఇరువైపుల పెద్దలను ఒప్పించిన ఈ జంట ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా పెళ్లి పీటలెక్కిన ఈ జంట తమ కొత్త జీవితాన్ని సంతోషంగా ప్రారంభించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!