

కోకాపేట్‌లోని శ్రీ శారదా పీఠం భూముల విషయంలో ఏర్పడిన గందరగోళం సమాచార లోపం వల్లే జరిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఆ భూములు పూర్తిగా పీఠానికే చెందుతాయని స్పష్టం చేస్తూ, పీఠం అభివృద్ధి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆదివారం శ్రీ శారదా పీఠాన్ని సందర్శించిన మంత్రి రాజ శ్యామల అమ్మవారి ఆలయం సహా పలు నిర్మాణాలను పరిశీలించి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
మీడియాతో మాట్లాడిన మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని తెలిపారు. వాస్తవాలు తెలిసిన వెంటనే జరిగిన పొరపాటును సరిదిద్దామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మతాన్ని రాజకీయాలకు ఉపయోగిస్తూ కొందరు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం బుల్డోజర్ సంస్కృతిని అనుసరించదని, కబ్జాల నుంచి ప్రభుత్వ భూములను కాపాడడమే లక్ష్యమని పేర్కొన్నారు. బాపు ఘాట్ అభివృద్ధిపై తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!