

తెలంగాణ ముఖ్యమంత్రి పదవిలో ఉండి మాజీ సీఎం కేసీఆర్ పై అట్లాంటి భాష వాడటం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. “సీఎం హోదాలో ఉన్నప్పుడు హుందాగా, సున్నితంగా వ్యవహరించాలి. ఇకనైనా అట్లాంటి భాష వాడకూడదు” అని సీఎం రేవంత్ రెడ్డి కి సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో గురువారం బండి సంజయ్ మీడియాతో చిట్-చాట్ చేశారు.
తెలంగాణ ప్రజలు సీఎం వ్యాఖ్యలపై చర్చించుకుంటున్నారని అయన గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబం కంటే పెద్ద శని తెలంగాణలో లేదని అయన మండీ పడ్డారు. తెలంగాణను సర్వనాశనం చేసిన కుటుంబం కేసీఆర్ దే అని సంజయ్ ఫైర్ అయ్యారు. ప్రత్యేకంగా, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, 575 టీఎంసీల కోసం 299 టీఎంసీలు మాత్రమే కేటాయించడం వంటి అంశాలన్నీ కేసీఆర్ పాలనలో సమస్యలుగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అపెక్స్ కమిటీ సమావేశంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ సమస్యలను గుర్తించారని, అవసరమైతే ఆ ఒప్పందాలను బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని బండి సంజయ్ తెలిపారు.
ఒక్కో పంచాయతీకి కేవలం రూ.5 లక్షలు మాత్రమే ఇవ్వమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పంచాయతీలకు సీఎం ఇవ్వాల్సిన వాస్తవ నిధులను తక్కువగా ఇవ్వడమా అని సంజయ్ ప్రశ్నించారు. నిజానికి, ఒక్కో పంచాయతీకి సగటున రూ.1 కోటి ఇవ్వాలని అయన డిమాండ్ చేశారు. కేంద్రం నుండి పంచాయతీలకు రూ.3,500 కోట్ల నిధులు రాబోతున్నాయని సంజయ్ ప్రకటించారు. తెలంగాణ ప్రజలు కట్టే టాక్సెస్ ల తో ఆరు గ్యారంటీలు ఇంకా ఎందుకు పూర్తి చేయటం లేదని సంజయ్ ప్రశ్నించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!