
న్యూస్

తెలంగాణ నూతన గవర్నర్గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, డీజీపీ శివధర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. గవర్నర్గా బాధ్యతలు స్వీకరించేందుకు హైదరాబాద్కు వచ్చిన ఆయనకు అధికార యంత్రాంగం తరఫున మర్యాదపూర్వక స్వాగతం అందించారు.

నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు లోక్ భవన్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ ఆయనతో గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!