
సినిమాలు

హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసన మండలి భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అజరుద్దీన్, దామోదర్ రాజ నర్సింహా, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు.
అలాగే ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మరియు అసెంబ్లీ ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శాసన మండలిలోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజ నిర్వహించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!