

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేసి, ప్రజలకు మంచి పాలన అందించాలని ఆయన ఆకాంక్షించారు. పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతూ ప్రజల మన్ననలు పొందాలని కోరారు. ఈ మేరకు సీఎం తన ఎక్స్ (X) ఖాతా ద్వారా ఎన్నికల్లో విజయం సాధించిన వారందరికీ అభినందనలు తెలియజేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు తెలంగాణలో మూడు దశల్లో నిర్వహించారు. నవంబర్ 11, 14, 17 తేదీల్లో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను దక్కించుకుని అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 6,821 స్థానాల్లో కాంగ్రెస్ 6,821 స్థానాలు గెలుచుకుంది.
ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 3,520 స్థానాలు దక్కించుకోగా, బీజేపీ 703 స్థానాల్లో విజయం సాధించింది. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి 1,654 స్థానాలను గెలుచుకున్నారు. ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ బలాన్ని స్పష్టంగా చాటుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!