
న్యూస్

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడిన సీఎం, ప్రతి శాసనసభ్యుడిని గౌరవించడం తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను ఇవాళే కాదు, ఆయన ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా కలిశాను. అసెంబ్లీ నుంచి ఆయన వెంటనే ఎందుకు వెళ్లారో ఆయన్నే అడగాలి అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇద్దరి మధ్య ఏం చర్చ జరిగిందని మీడియా ప్రశ్నించగా, మేమిద్దరం మాట్లాడుకున్న విషయాలు మీకు ఎలా చెబుతాం? అంటూ సీఎం స్పందించారు.
శాసనసభ ప్రారంభమైన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి, మర్యాదపూర్వకంగా పలకరించినట్లు సమాచారం.







.png&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!